ఫారెస్ట్​ ఆఫీస్​ వద్ద రైతుల ధర్నా

ఫారెస్ట్​ ఆఫీస్​ వద్ద రైతుల ధర్నా

మెదక్, వెలుగు: హవేలి ఘనపూర్​ మండలం గాజిరెడ్డిపల్లి కి చెందిన పలువురు రైతులు శనివారం జిల్లా ఫారెస్ట్​ ఆఫీస్​ వద్ద ధర్నా చేశారు.  కాంగ్రెస్​ నాయకులు గంగా నరేందర్​,  సర్పంచ్​ రాజిరెడ్డి, అడ్వకేట్​ జీవన్​ రావ్, పరుశరాం గౌడ్​,  బొజ్జ పవన్​ వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..

బీఆర్​ఎస్​ పార్టీకి సపోర్ట్​ చేస్తేనే పోడు పట్టాలు వస్తాయని లేదంటే అక్రమంగా అటవీ భూమి కబ్జా చేశారని కేసులు పెట్టిస్తామని కొందరు నాయకులు  బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.